ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ వేగంతో సాగుతోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చినట్లు, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖపట్నం నగరం అభివృద్ధి బాటలోకి అడుగుపెడుతోందని ఆయన అన్నారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.
విశాఖలో ఐటీ, డిజిటల్ రంగాల్లో గూగుల్ విస్తరణతో నగరం గ్లోబల్ హబ్‌గా మారబోతోందని అభిప్రాయపడ్డారు. యువతకు నూతన అవకాశాలు, రాష్ట్రానికి ఆర్థిక వృద్ధి ఇది తెచ్చే మార్గమని పేర్కొన్నారు.