సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరినీ చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూర్పు మండల డిసిపి బాల స్వామి తెలిపారు. నిందితుల నుండి ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకొని నెలవారిగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. ఆరు నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాను కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు. వెంటనే గణేశ్వర్ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్ లకు వాహనాలను విక్రయించినట్లు పోలీసులకు విచారణలో తేలడంతో వారిని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Sidhumaroju