అమెరికా మాజీ రాయబారి ఒకరు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన నిధుల ప్రభావంతో భారత్‌పై ట్రంప్ కక్షతో వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాక, భారత్–అమెరికా మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ట్రంప్ పరిరక్షించలేదని, పాక్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
భారత్ వంటి కీలక భాగస్వామిపై ట్రంప్ వైఖరిని విమర్శిస్తూ, ఆయన నిర్ణయాలు అమెరికా విదేశాంగ విధానాన్ని దెబ్బతీశాయని మాజీ రాయబారి అభిప్రాయపడ్డారు.