స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నట్లు మాజీ వికెట్‌కీపర్ దినేశ్ కార్తిక్ హింట్ ఇచ్చారు.
లండన్‌లో కోహ్లీ వారానికి మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తున్నారని, తన ఫిట్‌నెస్ మెరుగుపరచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీకే పేర్కొన్నారు. 2027 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలో జరగనున్న నేపథ్యంలో కోహ్లీ మళ్లీ జాతీయ జట్టులో కనిపించనున్నాడన్న సంకేతాలు అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి.
2023 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ కెరీర్‌పై అనేక ఊహాగానాలు వచ్చినా, ఈ తాజా సమాచారం అతని ఆటపై ఉన్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తోంది.