ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ నెస్లే, తన వ్యాపార మార్పు ప్రణాళికలో భాగంగా 16వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. కొత్త CEO ఫిలిప్ నవ్రాటిల్ నేతృత్వంలో సంస్థ వ్యయ నియంత్రణ, మార్కెట్ లీడర్‌గా నిలవాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో 12,000 వైట్ కాలర్ ఉద్యోగాలు, 4,000 ఉత్పత్తి, సరఫరా శాఖల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ చర్యల ద్వారా సంస్థ 2027 నాటికి 1 బిలియన్ స్విస్ ఫ్రాంక్ ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఉద్యోగుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెస్లే బ్రాండ్లు నెస్ప్రెస్సో, కిట్‌కాట్, ప్యూరినా వంటి వాటిపై ప్రభావం ఉండే అవకాశముంది.