సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ వద్ద నుండి శబరిమల వరకు 120 మంది అయ్యప్పలు నిర్వహించే పాదయాత్ర ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వినాయకుడిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అయ్యప్ప స్వాముల పాదయాత్ర ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గత 18 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పాదయాత్ర గా శబరిమల కు వెళ్ళి అయ్యప్పస్వామి ని దర్శించుకోవడం జరుగుతుందని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి పాదయాత్ర బృందం సభ్యుడు వెంకటేష్ యాదవ్ జాదవ్ తెలిపారు. నవంబర్ 23 వ తేదీన శబరిమల కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, నాగులు, ఓదెల సత్యనారాయణ, హన్మంతరావు తదితరులు ఉన్నారు.
ꜱɪᴅʜᴜᴍᴀʀᴏᴊᴜ