సికింద్రాబాద్: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన కార్యక్రమంను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబందనలు,వాటిని పాటించకపోతే విదించే చాలన్ల తో పాటు, ట్రాఫిక్ విభాగంలో ఉపయోగించే పరికరాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమంను సికింద్రాబాద్ బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ స్ట్యూట్ లో నిర్వహించారు. వందలాది మందిగా విద్యార్ధిని విద్యార్ధులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనగా..ట్రాఫిక్ సిబ్బంది వారు వినియోగించే వాహనలు, ట్రాఫిక్ లెజర్ కెమెరాలు ,బాడి కెమెరాలతో పాటు చాలన్ జనరేట్ అయ్యే విధానం నుతెలియజేప్పారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకోని ఉన్నత అధికారుల ఆదేశాలతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమంను నిర్వహించామని టిటిఐ ఎసిపి లక్ష్మణ్ తెలిపారు.
Sidhumaroju