Home South Zone Telangana రేపు బీసీ బంద్ : తెలంగాణ డిజిపి కీలక సూచనలు

రేపు బీసీ బంద్ : తెలంగాణ డిజిపి కీలక సూచనలు

0

హైదరాబాద్ : బీసీ సంఘాలు రేపు తలపెట్టిన బీసీ బంద్ ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు(అక్టోబర్18న) బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో డిజిపి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విభాగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, నిఘా బృందాలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్య వేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు.
Sidhumaroju

Exit mobile version