అమరావతిలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు ముగింపు పలికింది. ప్రభుత్వంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ 12 గంటల పాటు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ముఖ్య డిమాండ్లపై ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
1999–2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంట్రాక్టు ఉద్యోగులకు నేరుగా జీతం చెల్లించేందుకు, సమాన పనికి సమాన వేతనం కల్పించేందుకు అంగీకారం లభించింది.
క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక సబ్‌కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిణామాలు విద్యుత్ శాఖలో ఉద్యోగ భద్రతకు కొత్త ఆశలు నింపుతున్నాయి.