అమరావతిలో రాజకీయ వేడి పెరుగుతోంది. గతంలో జగన్ మెప్పు కోసం చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేశ్‌కు, ఇప్పుడు తెదేపా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘాటు సవాలు విసిరారు.
‘‘దమ్ముంటే మళ్లీ చంద్రబాబు ఇంటి గేటును తాకి చూపు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ, వైకాపా నేతల అవినీతి, అరాచక పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం మరణాల్ని దాచిపెట్టారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.