ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కల్తీ మద్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు.
కల్తీ మద్యం నిర్మూలనకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ‘‘సురక్ష’’ యాప్ ద్వారా నాణ్యమైన మద్యం సరఫరా, మద్యం ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు.
తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. త్వరలో SIT నివేదిక ద్వారా వాస్తవాలు బయటపడతాయని మంత్రి స్పష్టం చేశారు.