ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘకాల యుద్ధం అనంతరం ఇటీవల శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందన్న ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
“మంచిగా ఉండండి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారే ఏ చర్యనైనా అమెరికా సహించదని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి, మధ్యప్రాచ్యంలో శాంతి స్థిరతకు ఇది కీలక మలుపు కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.