రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
“ఉక్రెయిన్ రష్యాను ఓడించగలదని అనుకోను, కానీ సాధ్యమేనని మాత్రం చెప్పగలను” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. పుతిన్‌తో భేటీకి ముందు ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇటీవల జెలెన్స్కీతో జరిగిన సమావేశంలో ట్రంప్, డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలన్న సూచన చేశారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఈ పరిణామాలపై ఖమ్మం జిల్లా రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ, అమెరికా వైఖరిలో మార్పు ఉక్రెయిన్‌కు నష్టంగా మారవచ్చని అభిప్రాయపడుతున్నారు.