ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత్‌లో పెట్టుబడులకు వేగవంతమైన గేట్‌వేగా మారిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాల్లో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు.
పారిశ్రామిక వృద్ధికి అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతమైన మానవ వనరులు రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మార్చాయని వివరించారు.
అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు. పెట్టుబడుల ద్వారా ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.