అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు వైసీపీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశ్యం.
2024 ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, ప్రజలతో మళ్లీ మమేకం కావడం, పాత నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది.
జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించి, ప్రచార వ్యూహాలను రూపొందించేందుకు జగన్ నేతలకు సూచనలు ఇవ్వనున్నారని సమాచారం. పార్టీ శ్రేణుల్లో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.