గుంటూరు జిల్లా అమరావతిలో ఆర్థిక రంగానికి కొత్త ఊపునిచ్చేలా జాతీయ బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం ఈనెల 28న జరగనుంది.
CRDA సమీపంలో ప్రత్యేకంగా కేటాయించిన స్థలాల్లో స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితర జాతీయ బ్యాంకులు తమ రాష్ట్ర కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాయి.
అమరావతిని బ్యాంకింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ఇది నగర అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు కీలకంగా నిలవనుంది.