మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన నియోజకవర్గం లోని బొల్లారం, బోయిన్ పల్లి ప్రాంతాల పరిధిలో పలు చోట్ల నిర్వహించిన సదర్ సమ్మేళన ఉత్సవాలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. యాదవ సమాజం ఐకమత్యానికి సూచిక, వారి సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీక అయిన సదర్ పండుగను పురస్కరించుకుని పశువులకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.రాష్ట్ర అభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి యాదవ సమాజానికి తగిన గౌరవం ఇచ్చిందని తెలిపారు.ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, జయప్రకాష్, ప్రభాకర్ యాదవ్, పెద్దాల నరసింహ, మారుతి గౌడ్, సదానంద్,శరత్, అరుణ్ యాదవ్, తదితరులు ఉన్నారు.
Sidhumaroju