విశాఖపట్నంలో వచ్చే నెల జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మూడు రోజుల యూఏఈ పర్యటన కోసం ఈరోజు దుబాయ్ చేరుకున్నాను.
విమానాశ్రయంలో స్థానిక తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. వారి ఆప్యాయత నన్నెంతో ఆనందపరిచింది. ఈ పర్యటనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నాను.
రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమైన దశగా మారనుంది. విశాఖ సదస్సు ద్వారా పరిశ్రమల రంగంలో కొత్త దిశలు తెరుచుకునే అవకాశం ఉంది.