Home South Zone Andhra Pradesh ఆత్మకూరు లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు |

ఆత్మకూరు లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు |

0

ఆత్మకూరులో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు….
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ శీలం శేషు అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం నుండి గౌడ్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ లో గల అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థినీ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి గజమాలవేసి స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు డివిజన్ అధికారి నాగజ్యోతి, ఆత్మకూరు తాసిల్దార్ ఆత్మకూరురత్న రాధిక, ఆత్మకూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఎస్సై వెంకట నారాయణరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సి.సుంకన్న ఎంపీడీవో సయ్యద్ ఉమర్, గవర్నమెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవానంద్, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగా నాయక్ లు పాల్గొన్నారు.

వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 రాజ్యాంగం పరిషత్తులో తీర్మానం చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న రాజ్యాంగ సభలో అమలులోకి తీసుకొని రావడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని బావి భారత పౌరులు అందరూ గుర్తుంచుకోదగ్గ విషయమని ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, శీలయ్య, డప్పు వెంకటేశ్వర్లు, సాల్మన్, గవర్నమెంట్ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version