Home South Zone Andhra Pradesh హెల్మెట్ తప్పనిసరి: ఎస్సై హనుమంత రెడ్డి సూచన |

హెల్మెట్ తప్పనిసరి: ఎస్సై హనుమంత రెడ్డి సూచన |

0

హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి నీ ప్రాణాలు కాపాడుకోండని గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి అన్నారు బుధవారం స్థానిక పాత బస్టాండ్ లో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి హెల్మెట్ విషయంలో
కౌన్సిలింగ్ ఇచ్చారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి అతివేగంగా
వాహనాలు నడపరాదని అతివేగం ప్రాణాలకు హానికరమని అన్నారు లైసెన్సులు లేనిదే వాహనాలు నడప రాదని చిన్న చిన్న పిల్లలకు తల్లిదండ్రులు మోటార్ సైకిల్ ఇచ్చి వాహనాలు నడిపేందుకు సహకరిస్తున్నారని

పిల్లల తల్లిదండ్రులు వాహనాల విషయంలో జాగ్రత్త ఉండాలని కోరారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రయాణం చేయాలని లేని పక్షంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారికి కఠినంగా శిక్షించి రుసుములు వేస్తామని హెచ్చరించారు ఈయన వెంట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Exit mobile version