ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య రాజకీయ వివాదం తీవ్రంగా ముదురుతోంది.
టికెట్ కోసం డబ్బులు ఇచ్చానంటూ కొలికపూడి తన బ్యాంక్ స్టేట్మెంట్‌ను విడుదల చేసి, వాట్సప్ స్టేటస్‌లో చిన్నికి ఇచ్చిన లావాదేవీల వివరాలు పోస్ట్ చేశారు. “శుక్రవారం మాట్లాడుకుందాం” అంటూ స్టేటస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
దీనిపై ఎంపీ కేశినేని స్పందిస్తూ, “మొన్నటి వరకు నన్ను దేవుడు అన్నారు, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే చెప్పాలి” అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతలతో చర్చించనున్నట్టు సమాచారం. ఈ వివాదం టీడీపీ అంతర్గత రాజకీయాలను బహిరంగంగా తెరపైకి తీసుకొస్తోంది.