Home South Zone Telangana ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాంచందర్‌ రావు అరెస్టు |

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాంచందర్‌ రావు అరెస్టు |

0

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు‌ను మోయినాబాద్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సచివాలయం వద్ద ఆందోళనకు వెళ్లే సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల నియోజకవర్గంలో 24 గంటల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కి వస్తుండగా అరెస్టు జరిగింది. బీజేపీ కార్యకర్తలు “సేవ్ హైదరాబాద్” పేరుతో నిరసనకు సిద్ధమవుతుండగా, పలువురు నేతలు, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతోందని రాంచందర్ రావు ఆరోపించారు. ఈ అరెస్టుపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

NO COMMENTS

Exit mobile version