ఈ-కామర్స్ వెబ్‌సైట్లు వినియోగదారులను ఆకర్షించేందుకు ‘డార్క్ ప్యాటర్న్’ అనే మోసపూరిత వ్యూహాలను ఉపయోగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అవసరం లేని వస్తువులను మనకే తెలియకుండా కార్ట్‌లో చేర్చడం, తక్కువ ధర చూపించి చివర్లో అధిక చార్జీలు వేయడం, ఆఫర్లు త్వరగా ముగుస్తాయన్న భయం కలిగించడం వంటి పద్ధతులు వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయి.
ఈ తరహా మోసాలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. బాధితులు consumerhelpline.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్ షాపింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవడం, ఆర్డర్ చేసే ముందు అన్ని వివరాలు చదవడం అవసరం.