బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని SPSR నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అక్టోబర్ 23 నుంచి ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో నీటి ముంపు, రవాణా అంతరాయం, విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలు అధికారిక సమాచారం ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవాలి.