రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (Rare Earth Elements) అంటే అరుదుగా లభించే భౌతిక మూలకాలు. ఇవి మొత్తం 17 ఉండగా, లాంథనైడ్స్, స్కాండియం, యట్రియం వంటి మూలకాలు ఇందులోకి వస్తాయి.
ఇవి స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, మిలిటరీ టెక్నాలజీ, సెమీ కండక్టర్లు వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో కీలకంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం చైనా ఈ రంగంలో 90% శుద్ధీకరణ సామర్థ్యంతో ప్రపంచాన్ని శాసిస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలోని తూర్పు తీర ప్రాంతాల్లో REEs అన్వేషణకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. భారత్ 6% గ్లోబల్ రిజర్వులతో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.