రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 5810 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, అకౌంట్స్ అసిస్టెంట్ వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని యువతకు ఇది మంచి అవకాశంగా మారనుంది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు rrbapply.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.
కనీస అర్హతగా డిగ్రీ ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశల్లో ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.