ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటనను ప్రారంభించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సును ప్రోత్సహించేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటన చేపట్టారు.
దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం సందర్శనతో పాటు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వన్-టు-వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోభా గ్రూప్ చైర్మన్ పీఎన్‌సీ మెనన్, ట్రాన్స్‌వోల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణతో పోర్ట్, ఐటీ పార్క్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులపై చర్చలు జరిగాయి.
అమరావతి అభివృద్ధిపై కూడా వివరాలు ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.