ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో విరాట్ కోహ్లి డకౌటై వెళ్తూ అడిలైడ్ స్టేడియంలో అభిమానులకు చేతిని పైకి చూపిస్తూ థాంక్స్ చెప్పారు. ఈ గెస్చర్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
“ఇది కోహ్లి చివరి అడిలైడ్ మ్యాచ్ కావచ్చు” అని కొందరు అభిప్రాయపడుతున్నారు. “రిటైర్మెంట్‌కు సంకేతంగా” భావించిన అభిమానులు కూడా ఉన్నారు. కోహ్లి వరుసగా రెండు వన్డేల్లో డకౌటవడం అతని కెరీర్‌లో తొలిసారి.
ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయిన కోహ్లి, ODIల నుంచి కూడా వీడ్కోలు చెప్పనున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. అభిమానులు మాత్రం “కింగ్ కోహ్లి”కి ఎప్పటికీ మద్దతుగా నిలుస్తున్నారు.