ఎక్సైజ్ శాఖలో ఏర్పడిన పరస్పర విభేదాల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయ్యారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జూపల్లి, తన ఆదేశాలను పట్టించుకోలేదని భట్టికి వివరించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని కొన్ని అంశాల్లో కమిషనర్ పరిమితిని మించి నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి ఆరోపించారు.
లేఖల ద్వారా అధికార పరిమితుల దాటి వ్యవహరించడంపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం రాష్ట్ర పాలనలో అధికార సంబంధాలపై చర్చకు దారితీసింది. భట్టి ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు సమాచారం.




