తూర్పు తీర ఆర్థిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌లో కంటైనర్ మెగా పోర్ట్ అవసరమని NITI ఆయోగ్ CEO బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. “పూర్వోదయ” పథకం కింద తూర్పు తీరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
1,054 కిలోమీటర్ల తీరరేఖ కలిగిన ఏపీ, సముద్ర మార్గాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ద్వారంగా మారే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం వంటి తీర ప్రాంతాల్లో మెగా పోర్ట్ అభివృద్ధి ద్వారా లాజిస్టిక్స్, ఎగుమతులు, పరిశ్రమలకు ఊతమిచ్చే అవకాశముంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను తీసుకురావడమే కాక, తూర్పు భారత ఆర్థిక ప్రగతికి దోహదపడనుంది.



