ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు UAE పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాల్లో రాష్ట్రాన్ని “గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్”గా ప్రస్తావించారు.
ఆయిల్, LNG, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు 1,054 కిలోమీటర్ల తీరప్రాంతం అనుకూలంగా ఉందని ADNOC, Sharaf Group, G42 వంటి సంస్థల ప్రతినిధులకు వివరించారు.
అమరావతిలో 2026 జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నవంబర్ 14న విశాఖపట్నంలో జరిగే CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు UAE పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఈ పర్యటన ద్వారా APలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు మార్గం సుగమమవుతోంది.



