ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు విక్టోరియా రాష్ట్రాల్లో క్రికెట్ క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కల్పించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా క్రికెట్ శిక్షణా మోడల్‌ను రూపొందించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి.
