Home Sports సిడ్నీ వన్డేలో భారత్‌ టార్గెట్‌ 237 పరుగులు |

సిడ్నీ వన్డేలో భారత్‌ టార్గెట్‌ 237 పరుగులు |

0

సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌కు 237 పరుగుల లక్ష్యం ఏర్పడింది. భారత బౌలర్లలో హర్షిత్‌ అద్భుత ప్రదర్శనతో 4 వికెట్లు పడగొట్టాడు.

సుందర్‌ 2 వికెట్లు తీసి మద్దతు అందించగా, సిరాజ్‌, ప్రసిధ్‌, కుల్దీప్‌, అక్షర్‌ తలో వికెట్‌ తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.

మ్యాచ్‌ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, మధ్యలో కొంత స్థిరత కనబర్చినా, భారత బౌలింగ్‌ దాడికి తలొగ్గింది. ఇప్పుడు భారత్‌ ఛేజింగ్‌లో విజయం సాధించాలంటే మెరుగైన బ్యాటింగ్‌ అవసరం. అభిమానులు ఉత్కంఠగా మ్యాచ్‌ను తిలకిస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version