తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వ, అసైన్డ్, ఎండోమెంట్, అటవీ భూముల వివరాలపై సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పని చేసి నివేదికను రూపొందించింది.
కలెక్టర్ అథెంటికేషన్ లేకుండా, రిపోర్టులు లేకుండా, అర్ధరాత్రి వేళల్లో భూముల వివరాలు మారినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. బోగస్ పత్రాల ఆధారంగా భూములు ప్రైవేట్ వ్యక్తుల పేర్లకు మార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నివేదిక రాజకీయంగా సున్నితమైన జిల్లాల్లో భూ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వం తదుపరి చర్యల కోసం నివేదికను పరిశీలిస్తోంది.
