Home South Zone Telangana అభ్యర్థుల గెలుపు కోసం పూజ‌లు |

అభ్యర్థుల గెలుపు కోసం పూజ‌లు |

0

మూడవ విడత ఎన్నికలు మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడ మండలంలో గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి సీతక్క గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మండలకేంద్రంలో  నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ…సర్పంచ్ ఉప సర్పంచ్ నా చేతిలో పెట్టండి.
ఎంత మార్పు వస్తాదో చూడండి ఆ తర్వాతనే నాకోసం ఎలక్షన్లకు నేను ఓట్లు అడుగుతానని అన్నారు.గత ప్రభుత్వం ఏన్ని ఇందిరమ్మ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగూడ మండలానికి 500 ఇండ్లు, గంగారం మండలానికి 500 ఇండ్లు లతోపాటు రైతు రుణమాపి ఇచ్చిందని అన్నారు.

కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంపై దృష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని, మండలకేంద్రాన్ని రూపురేఖలు మార్చిన తర్వాతనే నా కోసం నేను ఓట్లు అడుగుతా… మీరందరూ ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండి మీరు ఎప్పుడు కూడా నాకు తోడున్నరని అన్నారు.

#Vijaykumar

NO COMMENTS

Exit mobile version