స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరులకు అవగాహన కల్పించేందుకు ‘ఉచిత వెబినార్ నిర్వహిస్తోంది.
క్లెయిం చేయని డివిడెండ్లు, షేర్లను తిరిగి పొందే విధానాలు, IEPF ద్వారా రికవరీ ప్రక్రియ, మోసాల నివారణ, పెట్టుబడుల భద్రత వంటి అంశాలపై నిపుణులు వివరించనున్నారు. రూ.50,000 కోట్లకు పైగా విలువైన షేర్లు, డిపాజిట్లు IEPFలో ఉండగా, వాటిని తిరిగి పొందడం ఎలా అన్నదానిపై స్పష్టత ఇవ్వనున్నారు.
ఈ వెబినార్ ద్వారా మదుపరులు తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలో, కంపెనీల వద్ద ఉన్న క్లెయిం చేయని ఆస్తులను ఎలా గుర్తించాలో తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్‌లో భద్రతతో పాటు అవగాహన కూడా అవసరమని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోంది.




