హైదరాబాద్ పోచారంలో 1978లో 27 ఎకరాల్లో 400 ప్లాట్లతో నిర్మితమైన జీపీ లే అవుట్‌లో, ఓ వ్యక్తి 6.18 ఎకరాల భూమి తమదేనంటూ అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారు.
ఈ నిర్మాణంపై లే అవుట్ సొసైటీ సభ్యులు సుమారు 8 ఏళ్లుగా పోరాటం సాగించారు. చివరకు ప్రజావాణి ద్వారా HYDRA దృష్టికి తీసుకెళ్లిన అనంతరం, కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
కలెక్టర్ అథెంటికేషన్ లేకుండా, బోగస్ పత్రాలతో భూమి ఆక్రమణ జరిగిందని తేలడంతో HYDRA సిబ్బంది ప్రహరీ గోడను తొలగించారు. ఈ చర్యతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు నివారించేందుకు అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




