ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల దుబాయ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులతో కూడా ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న CII ఇన్వెస్టర్స్ మీట్‌కు ఆహ్వానం అందించారు.
రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు కీలకమని, పారిశ్రామిక వృద్ధికి అనుకూల వాతావరణం ఏపీలో ఉందని వివరించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.




