అమరావతికి సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో అక్టోబర్ 25న రెండు ఇండిగో విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేశాయి. అసోం-హైదరాబాద్, బెంగుళూరు-హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణిస్తున్న విమానాలను, హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సాధ్యపడలేదు.
దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులు కొంతకాలం విమానంలోనే ఉండాల్సి రావడంతో అసౌకర్యానికి గురయ్యారు. వాతావరణం మెరుగుపడిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తామని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు.
