కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం హైదరాబాద్‌లో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) భారీ తనిఖీలు చేపట్టింది. మూడు రోజుల్లో 143 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.
రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో అనేక బస్సుల్లో భద్రతా లోపాలు, అనుమతుల లేమి, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు అడ్డంగా ఉండటం, కాలం చెల్లిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాల కోసం నడుపుతున్న బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ జిల్లాలో LB నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ మార్గాల్లో నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అధికారులు భద్రతా ప్రమాణాలు పాటించని ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






