Home South Zone Telangana భాగ్యనగరంలో ఆఫ్రికన్ నత్తలు – భయాందోళనలో ప్రజలు.|

భాగ్యనగరంలో ఆఫ్రికన్ నత్తలు – భయాందోళనలో ప్రజలు.|

0
5

సికింద్రాబాద్ : భాగ్యనగరంలో నత్తలు  బెంబేలెత్తిస్తునాయి. ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహా వృక్షాలైన నేలకు ఒరగాల్సిందే.. శరవేగంగా విస్తరిస్తున్న ఈ నత్తల మూలంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందిన మూడు ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవి ఆకులు చిగుళ్ళు కాండం పూత పిందెలను కాకుండా ఏకంగా వృక్షాలే నేలకురిగేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్ అంతట విస్తరిస్తే ఉన్న కొద్దిపాటి పార్కులు ఇండ్లలో పెంచుకునే ముక్కలు మిగలరని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో ఎక్కువగా కనిపించే ఈ నత్తలు బోయిన్పల్లిలో కనబడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీటి జీవితకాలం అయిదారేళ్ళు కాగా ఒక్కోటి నెలకు వందల సంఖ్యలో గుడ్లను పెట్టి విపరీతంగా సంతాన ఉత్పత్తి అభివృద్ధి చేస్తాయి.

గతంలో ఆంధ్రప్రదేశ్లోని ఉపయోగపడే శ్రీకాకుళం జిల్లాలో రైతులను మిత్రులు లేకుండా చేసి బొప్పాయి ఆయిల్ ఫామ్ మిరప తదితర పంటలను పూర్తిగా నాశనం చేయడంతో అప్పట్లో నిపుణుల సూచనల మేరకు ఉప్పు ద్రావణం కాపర్ సల్ఫేట్, స్నెయిల్ కిల్లర్ మందు వాడే పిచికారి చేసి అదుపులోకి తెచ్చారు. వాతావరణం లోని తేమ ఎక్కువగా ఉండే చోట అభివృద్ధి చెందుతాయని ఆఫ్రికా నుంచి ఓడల ద్వారా వచ్చి ఉంటాయని నిపుణులు అంటున్నారు.

పురుగుల మందుల ద్వారా నివారించవచ్చు అని పర్యావరణానికి ఇవి అత్యంత ప్రమాదకరమని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే వాటితో తగ్గిపోతాయని అన్నారు.
కంటోన్మెంట్ యంత్రాంగం వెంటనే స్పందించి చీడ నివారణకు రసాయనాలు ఉప్పు ద్రావణాలతో పిచికారి చేయించారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రహరీ గోడతో పాటు చెట్లకు పుట్టలపై పిచికారి చేయించి వాటిని సంహరించారు.

Sidhumaroju

NO COMMENTS