తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి జపాన్ సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైటెక్, ఇన్వెస్ట్మెంట్, గ్రీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ రంగాల్లో జపాన్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.
జపాన్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్లలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రెండు పక్షాలు అంగీకరించాయి.
ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను పెంచుతూ తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జపాన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
