హైదరాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటనతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మణికొండ పంచవటి కాలనీలో భూమి వివాదం నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.
వివరాల ప్రకారం — పంచవటి కాలనీలో తమ స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రభాకర్ ఒత్తిడి తెచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. “స్థలం ఖాళీ చేస్తారా లేదా?” అంటూ హెచ్చరిస్తూ, ప్రభాకర్ తన తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం.
ఈ అనూహ్య ఘటనతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి, పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
