విశాఖపట్నం జిల్లాలో ప్రతిరోజూ పాముల సంచారం ఎక్కువగా ఉండటం క్రమంలో స్థానిక ప్రజలందరూ ఆందోళనలో ఉంటారు. కొండచిలువలు, నాగుపాములు, కింగ్ కోబ్రాలు తరచూ జనావాసాల్లోకి రావడం ఒక సాధారణ పరిస్థితిగా మారింది.
ఈ క్రమంలో స్నేక్ క్యాచర్ కిరణ్ స్థానికులు అందించిన సమాచారాన్ని ఉపయోగించి వెంటనే పాములను పట్టుకొని అడవిలో వదిలిపెడుతున్నారు.
ఇటీవల విశాఖ నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పాములను ఆయన తన ఇంటివద్ద భద్రంగా ఉంచారు. కొన్ని పాములు పోగవడంతో, నవంబరు 4 మంగళవారం నాటికి తన బృందంతో కలిసి అన్ని పాములను పారవాడ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
మొత్తం 20కి పైగా పాములు సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోయాయి. పాముల కోసం ఆహారం మరియు సౌకర్యాలు కల్పిస్తూ, భద్రతతో వాటిని కాపాడడం ఆయన ముఖ్య కర్తవ్యంగా నిలిచింది.
