Home South Zone Telangana హెచ్1బీ వీసాదారులకు గుడ్ న్యూస్ – కెనడా నుంచి కొత్త ఆఫర్లు|

హెచ్1బీ వీసాదారులకు గుడ్ న్యూస్ – కెనడా నుంచి కొత్త ఆఫర్లు|

0

అమెరికా ఆంక్షల వేళ కెనడా కీలక నిర్ణయం – హెచ్1బీ వీసాదారులకు గుడ్ న్యూస్!
అమెరికాలో వలసలపై ఆంక్షలు కఠినమవుతున్న తరుణంలో, కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల (Foreign Students) సంఖ్యను 25 నుండి 32 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించింది.

అదే సమయంలో, నైపుణ్యాలున్న పరిశోధకులు, నిపుణులు, ముఖ్యంగా అమెరికాలోని హెచ్1బీ వీసాదారులు (H1B Visa Holders) కెనడాలో స్థిరపడే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ (PM Mark Carney) తన తొలి బడ్జెట్‌లో రూ.106 కోట్లతో అంతర్జాతీయ ట్యాలెంట్‌ను ఆకర్షించే పథకాన్ని ప్రతిపాదించారు.

ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది హెచ్1బీ వీసాదారులు కెనడాలో అవకాశాలు పొందే అవకాశం ఉంది. విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించి, నిపుణులను ప్రోత్సహించడం ద్వారా కెనడా ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

NO COMMENTS

Exit mobile version