టాటా మోటార్స్ — భారత వాహనరంగంలో విశ్వసనీయమైన పేరు. ప్రతి సారి కొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చే ఈ కంపెనీ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం టాటా నుంచి కేవలం రూ.55,999కే కొత్త 125సీసీ బైక్ వస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ బైక్ తక్కువ ధరలో అధిక మైలేజీ, స్టైలిష్ లుక్‌తో మార్కెట్‌లో సంచలనం సృష్టించబోతుందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
ఈ కొత్త బైక్ 100 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనే పోస్టులు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే హీరో, హోండా, బజాజ్ వంటి దిగ్గజ కంపెనీలు ద్విచక్ర వాహన రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా, టాటా ఎంట్రీతో పోటీ మరింత తీవ్రం కానుందని అనుకుంటున్నారు.
అయితే ఇప్పటివరకు టాటా మోటార్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే కంపెనీ అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.




