హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) లో శుక్రవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వియత్నాం ఎయిర్‌లైన్స్ (Vietnam Airlines) కు చెందిన వీఎన్–984 విమానం వియత్నాం బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక సమస్య తలెత్తడంతో సర్వీసును నిలిపివేశారు. దీంతో 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు.
ఎయిర్‌లైన్స్ సిబ్బంది (Airline staff) తగిన సమాధానాలు ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ తమ ఇబ్బందులను వెల్లడించారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఎయిర్‌పోర్టు అధికారులు జోక్యం చేసుకుని ప్రయాణికులను శాంతింపజేశారు. విమానం మరమ్మతుల అనంతరం త్వరలోనే ఫ్లైట్ సర్వీసులు పునరుద్ధరించనున్నట్లు సమాచారం.
