టాలీవుడ్ హాట్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, వీరి నిశ్చితార్థం అక్టోబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా జరిగిందని టాక్ వినిపిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వార్తలపై రష్మిక, విజయ్ ఇద్దరూ ఎలాంటి ఖండన చేయకపోవడం. పైగా, ఇద్దరి చేతుల్లో ఒకే తరహా రింగ్స్ కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
ఇక తాజాగా, విజయ్–రష్మిక పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక రాజభవనంలో జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ జంట ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఆసక్తి మరింత పెరిగింది. టాలీవుడ్లో మరో స్టార్ వెడ్డింగ్ రానుందా అనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో నెలకొంది.




