మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుండి ఎంపీ ఎమ్మెల్యే నుండి ముఖ్య మంత్రి స్తాయికి ఎదగడం గర్వకారణమని కొనియాడారు. అదేవిదంగా మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్, తోట లక్ష్మీ కాంత్ రెడ్డి, నిమ్మ అశోక్ రెడ్డి,సురేందర్ రెడ్డి, కృష్ణా గౌడ్,వీనస్ మేరీ, లక్ష్మీ, నాగేశ్వరరావు,భాస్కర్, రాజ సింహ రెడ్డి, శ్రీశైలం యాదవ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Sidhumaroju






