Home South Zone Telangana రన్‌వే అవసరం లేని విమానం – శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ|

రన్‌వే అవసరం లేని విమానం – శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ|

0

ప్రపంచంలో కొద్దిమంది దేశాలే రన్‌వే అవసరం లేకుండా ఎగరగల విమానాల టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్‌ కూడా చేరింది. ఐఐటీ మద్రాస్‌ బృందం అభివృద్ధి చేసిన హైబ్రిడ్‌ రాకెట్‌ థ్రస్టర్‌, వర్చువల్‌ సిమ్యులేషన్‌ టెక్నాలజీ సహాయంతో, విమానం నిలువుగా ఎగరడం మరియు దిగడం సాధ్యమైంది. ఈ టెక్నాలజీ అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్‌ ఆధారంగా రూపొందించబడింది.

భారత శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో ఫ్లయింగ్‌ టాక్సీ లాంటి మోడళ్లను విజయవంతంగా పరీక్షించారు. ఐఐటీ మద్రాస్‌ ఏరోస్పేస్‌ విభాగం ప్రకారం, ఈ సిస్టమ్‌ టెక్నికల్‌గా, కమర్షియల్‌గా ఉపయోగించగలిగితే, అది వైమానిక రంగంలో గేమ్‌ ఛేంజర్‌ కానుంది. ప్రస్తుతం హెలికాప్టర్‌ మాత్రమే నిలువుగా ఎగరగల వాహనం అయినా, దాని వేగం తక్కువగా, మెయింటెనెన్స్‌ ఖర్చు అధికంగా ఉంటుంది.

కానీ ఈ కొత్త టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో రన్‌వేలు లేకుండానే విమానాలు ఎగరడం, దిగడం సాధ్యమవుతుంది. కొండలు, అడవులు వంటి కఠిన ప్రాంతాల్లో కూడా విమానాలను సులభంగా ల్యాండ్‌ చేయడం వీలవుతుంది.

NO COMMENTS

Exit mobile version